చిక్కడపల్లి : సీఎం రిలీఫ్ కొనుకు దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ సీఎంఆర్ఎఫ్ (CMRF) ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ఎమ్మెల్యే ముఠాగోపాల్ ( MLA Mutha Gopal ) అన్నారు. గాంధీనగర్ డివిజన్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ ద్వారా మంజూరైన 20 మంది లబ్ధిదారులకు రూ 6,49,500 చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులుంటే సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే సహయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గ గాంధీనగర్, కవాడిగూడ, అడిక్మెట్, రాంనగర్ డివిజన్ల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాకేష్ కుమార్, వల్లల శ్యామ్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, బీఆర్ఎస్ నాయకులు ముఠా నరేష్, మీడియా ఇన్చార్జి ముచ్చ కుర్తి ప్రభాకర్, ఆకుల అరుణ్ కుమార్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా ,ముదిగొండ మురళి, పూన్న సత్యనారాయణ, ఖలీల్, శ్రీహరి, కుమారస్వామి, నర్సింగ్, యాదగిరి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.