బడంగ్‌పేట, జనవరి 19 : ప్రపంచంలోనే మరెక్కడేని విధంగా గినీస్ రికార్డును నమోదు చేసే తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచనాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే ‘కంటి వెలుగు’ అని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం బాలాపూర్ మండల పరిధిలోని జిల్లెగూడలోని అంబేద్కర్‌నగర్ బస్తీలోని అంబేద్కర్ భవనంలో, బడంగ్‌పేటలో ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, జిల్లా వైద్య అధికారి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంధత్వాని నిర్మూలించే దిశగా చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అని అన్నారు. దృషిలోపంతో ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఒకరు కాదు నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి వారి సమక్షంలో ప్రారంభించిన కంటి వెలుగు అనే గొప్ప కార్యక్రమాన్ని చూసిన పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కంటి వెలుగు కార్యక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయారన్నారు. తెలగాణ రాష్ర్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ రాష్ర్టాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారని అన్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ మాట్లాడుతూ దవాఖానలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకునే వెసులు బాటు లేని వాళ్లకు కంటి వెలుగు శిబిరాలు ఎంతో గొప్ప అవకాశంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ గీతా, మున్సిపల్ కమిషనర్లు క్రిష్ణ మోహన్ రెడ్డి నాగేశ్వర్, ఆర్డీవో కార్పొరేటర్ గౌరి శంకర్, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.