మన్సూరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ హ్యండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా చింతా ప్రభాకర్‌ను, పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గూడూరు ప్రవీణ్‌ను నియమించడాన్ని హర్షిస్తూ బుధవారం ఎల్బీనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాల వద్ద ఎల్బీనగర్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎల్బీనగర్ చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు చెరుకు స్వామి, మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు రుద్ర యాదగిరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేనేత రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. చేనేత కార్మికులకు జీవనోపాధి చూపించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు దక్కుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ చేనేత కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొట్టిబత్తిని రమేశ్, సభ్యులు దుస్స కుమార్, సంగెపు నరేందర్, జూలూరు లక్ష్మయ్య, మేకల జగన్నాథం, నల్ల శంకర్, సామల ప్రసాద్, గంజి రాజు, దోర్నాల స్వామి, దోర్నాల కృష్ణయ్య, వనం యాదగిరి, రుద్ర మల్లేశం తదితరులు పాల్గొన్నారు.