అంబర్‌పేట, కాచిగూడ, గోల్నాక : సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో వర్ధిల్లాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని అంబర్‌పేట నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట డివిజన్లలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాలుపంచుకున్నారు.
నియోజకవర్గానికి చెందిన అన్ని డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన బాగ్ అంబర్‌పేట డివిజన్లోని అంబర్‌పేట మహంకాళి దేవాలయం, సాయిబాబానగర్‌లో గల శ్రీషిర్డీ సాయిబాబా దేవాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. అనంతరం కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.
సీఎం బర్త్ డే కేక్ ను కట్ చేశారు. నల్లకుంట ఫీవర్ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. టీఆర్టీ కాలనీలో గల స్ఫూర్తి అనాథ ఆశ్రమంలో పిల్లల మధ్య బర్త్ డే కేక్ కట్ చేసి వారికి భోజనాలు పెట్టారు.
ఈ కార్యక్రమాల్లో అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్, బాగ్‌అంబర్‌పేట మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిడీపీరెడ్డి, నల్లకుంట కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవిరమేష్, దిడ్డి రాంబాబు, ఆయా డివిజన్ల అధ్యక్షులు మేడి ప్రసాద్, చంద్రమోహన్, సిద్ధార్థ్, భీష్మాదేవ్, కొమ్ము శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.