కాంగ్రెస్ మళ్లీ కౌలుదారు చట్టం తీసుకువస్తామని చెబుతున్నది. ఇలా రెండేండ్లు కౌలురైతు ఉంటే మూడో ఏడాది రైతుల భూమి గోల్మాల్ అవుతుంది. రైతులు చిప్పపట్టుకొని తిరగాల్సి వస్తది. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి భూక్య జాన్సన్ రాథోడ్, జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్కుమార్లకు మద్దతుగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. ఆనాడు కిరణ్కుమార్ రెడ్డి తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వనంటే.. ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా మాట్లాడిండా..? నోరు తెరిచిండ్రా..? తెలంగాణ రాష్ట్రంలో భాగం కాదారా సన్నాసి..? గట్ల ఎట్ల మాట్లాడుతవ్ అని తిరగబడ్డరా..? పేగులు తెగేదాక కొట్లాడినోడు ఎవడు.? తెలంగాణ తెచ్చినోడు ఎవడు.? 24 గంటల కరెంటు ఇచ్చినోడు, ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్లిచ్చినోడు ఎవడు..? కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినోడు ఎవడు? కాంగ్రెసోళ్లు ఇప్పుడొచ్చి మా అంత సిపాయి లేరని మాట్లాడుతున్నరు.
ధరణి లేకుంటే భూముల ధరలు పెరిగిన దానికి ఎన్ని పంచాయితీలు అవుతుండే.? ఎన్ని తలకాయలు పగిలిపోతుండే..? ఎన్ని కేసులు అవుతుండే.? ఒక్కసారి ఆలోచన చేయాలి. పాత కాంగ్రెస్ పాలన ఎట్లుండే మళ్లీ అదే పాలన మొదలవుతది. వారికి దళారులు, పైరవీకారులు, లంచగొండి అధికారులే సుట్టాలు.. అని బాజాప్తా చెప్తున్నరు. అధికారంలోకి వస్తే రైతుల నోట్లో మన్ను వోస్తం.. అని ఖుల్లం కుల్లాగా అంటున్నరు. ఇక్కడ జీవన్రెడ్డితోని ఏం అవుతది.. ముఖ్యమంత్రి అయినోడికి భజన చేయడం తప్ప.. రైతులకు కాంగ్రెస్ ఒక ఆశనీపాతం. తెలంగాణ ప్రజలకు శని, రైంతాగానికైతే మరీ దరిద్రం. వాళ్ల ఆలోచనలన్నీ దుర్మార్గమైనవి. ఇవన్నీ మేం భరిస్తామంటే మీ ఖర్మ.. నేనేం చేయలేను. జగిత్యాల జిల్లా అయితదని అనుకున్నమా.? మెడికల్ కాలేజీ వచ్చింది.
బ్రహ్మండంగా అభివృద్ధి అవుతున్నది. కాంగ్రెస్లో 12మంది ముఖ్యమంత్రులు ఉన్నరు. ఎవడు ఎప్పుడు అయితడో వాని అయ్యకు తెల్వది. వాడు గెలిచేది లేదు.. సచ్చేది లేదు. పార్టీల చరిత్రను బేరిజు వేయాలి. ఖానాపూర్లో 7500 మందికి 22,470 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినం. 3600 పైచిలుకు తండాలను పంచాయతీలు చేసినం. చేనేత, గీత, గంగ పుత్ర, యాదవ సోదరులు, అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టినం. ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతదని మీ గ్రామాలు, తండాల్లో చర్చ పెట్టాలి. అప్పుడే రాయేదో.. రత్నమేదో తెలుస్తది. మంచి సర్కారు ఏర్పాటైతది. వంద శాంత భయంకరమైన మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది. అని సీఎం కేసీఆర్ అన్నారు.