సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సంబురాలు గ్రేటర్లో రెండు రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. జనహృదయ నేత జన్మదినాన్ని పార్టీ నేతలు, గులాబీ శ్రేణులు, అభిమానులు, తమ ఇంటి పండుగలా చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధుల శుభాకాంక్షలతో గ్రేటర్ కూడళ్లు గులాబీమయం అయ్యాయి. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని క్రీడాపోటీలు, రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు.