సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 ( నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు వైరల్గా మారాయి. హ్యాపీ బర్త్డే, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పేర్లతో హ్యాష్ట్యాగ్లు హోరెత్తాయి. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కేసీఆర్పై ప్రేమను సామాజిక మాధ్యమాల వేదికగా చాటుకున్నారు. డీపీలు, వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్ పోస్టులు, ట్వీట్స్, ఇన్స్టాలతో అభిమాన వర్షం కురిపించారు.
ముంబాయిలోని సిద్ధివినాయక్ మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర నేత శ్రీనివాస్ సుల్గే
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన నఖ చిత్రకారుడు నరహరి 2500 ఫొటోలతో రూపొందించిన కేసీఆర్ చిత్రపటం సోషల్ మీడియాలో వైరలైంది