కాచిగూడ : తెలంగాణకు జన్మనిచ్చిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ గాంధీ, బంగారు తెలంగాణ నిర్మాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నీధి, సంక్షేమ పథకాల అమలుకర్త, భగీరధుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 68వ జన్మదిన వేడుకలు గురువారం కాచిగూడ డివిజన్లోని వాడవాడలా ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాచిగూడ డివిజన్ అధ్యక్షుడు ఎర్ర భీష్మాదేవ్,డివిజన్ ఇన్చార్జి శిరీషాయాదవ్, దిడ్డి రాంబాబు, సునీల్బిడ్లాన్, రవీందర్‌యాదవ్, బి.కృష్ణాగౌడ్, నాగేందర్బాబ్జి, ఎరబోలు నర్సింహ్మరెడ్డి,శ్రీరాములు ముదిరాజ్, రెడపాక రాము, పెంటం రమేశ్, శ్రీకాంత్‌యాదవ్, బబ్లూ, అంటోని,లింగంగౌడ్, బుచ్చిరెడ్డి, ఎల్.రమేశ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.