సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) ; గత రెండు పర్యాయాలు గ్రేటర్ హైదరాబాద్‌లో విజయ ఢంకా మోగించిన గులాబీ టీం ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయానికి సిద్ధమైంది. గ్రేటర్ ఓటర్ల ఆశీర్వాదంతో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా హైదరాబాద్ విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్నది. కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ఇదే ప్రగతి మరో ఐదేండ్ల పాటు కొనసాగాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలంటూ సీఎం కేసీఆర్ సోమవారం వెల్లడించిన తొలి జాబితాలో భాగంగా గ్రేటర్ టీంను కూడా ప్రకటించారు. వీటిలో కేవలం ఒకే ఒక్కటి మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ సిట్టింగ్‌లకే అవకాశం కల్పించడం విశేషం. అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్న నగర ఎమ్మెల్యేలు తొలి జాబితా ప్రకటన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతుండగా.. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో దిమ్మతిరిగిన ప్రతిపక్షాలు అసలు ఘట్టాలు మొదలుకాక ముందే కుదేలయ్యాయి. ప్రధానంగా గులాబీ గూటిలో అసంతృప్తుల కోసం గోతికాడి నక్కల్లా కాచుకు కూర్చున్న ప్రతిపక్ష పార్టీలకు నిరాశే ఎదురైంది.
జూబ్లీహిల్స్
అభ్యర్థి : మాగంటి గోపీనాథ్
తల్లిదండ్రులు : కృష్ణమూర్తి, మహానంద కుమారి
పుట్టిన తేదీ : 02/06/1963
భార్య : మాగంటి సునీత
పిల్లలు : మాగంటి వాత్సల్య నాథ్,
మాగంటి అక్షరనాగ, మాగంటి దిశిర
విద్యార్హత : బీఏ
కులం : ఓసీ ( కమ్మ)
పదవులు : హుడా డైరెక్టర్(1987-88), జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ( 2014, 2018) , హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు.
వృత్తి : వ్యాపారం
కుత్బుల్లాపూర్
అభ్యర్థి : కూన పాండు వివేకానందగౌడ్
తల్లిదండ్రులు : కేఎం పాండు, కేఎం శ్యామల
పుట్టిన తేదీ : 21/10/1977
భార్య : కేవీ సౌజన్య
పిల్లలు : కేవీ మాతృశ్రీ, కేవీ విదాత్వర్ధన్
విద్యార్హత : బీఈ, సివిల్ ఇంజినీర్,
కులం : బీసీ
పదవులు : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే 2014, 2018
వృత్తి : రాజకీయం.
ఖైరతాబాద్
అభ్యర్థి : దానం నాగేందర్
తల్లిదండ్రులు : దానం లింగమూర్తి, లక్ష్మీబాయి
పుట్టిన తేదీ : 09/08/1958
భార్య : దానం అనిత
పిల్లలు : దానం మనీష, దానం సాయిప్రియ
విద్యార్హత : ఎంఏ
కులం : బీసీ(మున్నూరు కాపు)
పదవులు : అసిఫ్‌నగర్ ఎమ్మెల్యే (1994, 1999, 2004), ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా (2009, 2018),2009నుంచి 2014దాకా ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో వైద్య, కార్మికశాఖ మంత్రి
వృత్తి : రాజకీయం
సికింద్రాబాద్
అభ్యర్థి : తిగుళ్ల పద్మారావుగౌడ్
తల్లి తండ్రులు : ఈశ్వరయ్య, రాములమ్మ.
పుట్టిన తేదీ : 07/04/1954
భార్య : స్వరూపగౌడ్
పిల్లలు : కిశోర్‌గౌడ్, కిరణ్‌గౌడ్, రామేశ్వర్, తినేత్ర, మనీష, మౌనిక.
కులం : బీసీ
పదవులు : 2001లో టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా
పనిచేశారు. రెండు సార్లు కార్పొరేటర్‌గా, 2004,2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.2019 నుంచి తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్గాకొనసాగుతున్నారు. 2014లో అబ్కారీ, క్రీడలు,
యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేశారు.
శేరిలింగంపల్లి
అభ్యర్థి : అరెకపూడి గాంధీ
తల్లిదండ్రులు : చిత్త రంజన్ దాస్, అనసూయమ్మ
పుట్టిన తేదీ : 15/10/1961
భార్య : అరెకపూడి శ్యామల
విద్యార్హత : పాలిటెక్నిక్ (డిస్కంటిన్యూ)
కులం : ఓసీ (వెలమ)
పదవులు : 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపు. ప్రభుత్వ విప్
వృత్తి : రాధికా ట్రాన్స్ఫార్మర్స్ ప్రైవేట్ లిమిటెడ్(సీఎండీ)
ఎల్బీనగర్
అభ్యర్థి : దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
తల్లిదండ్రులు : దేవిరెడ్డి జయచంద్రారెడ్డి, చంద్రకళ
పుట్టిన తేదీ : 27 /07/1962
భార్య : కమలారెడ్డి
పిల్లలు : ప్రీతం రెడ్డి, గౌతం రెడ్డి
విద్యార్హత : బీఏ
కులం : ఓసీ
పదవులు : 1986, 2001లో కార్పొరేటర్‌గా,2004 నుండి 2008 వరకు హుడా చైర్మన్‌గా, 2009, 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2021లో మూసీ రీవప్
ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు.
వృత్తి : రాజకీయం
అంబర్‌పేట
అభ్యర్థి : కాలేరు వెంకటేశం
తల్లిదండ్రులు : ఆంజనేయులు, జయమ్మ
పుట్టిన తేదీ : 10/12/1960
భార్య : కాలేరు పద్మ(గోల్నాక డివిజన్ మాజీ కార్పొరేటర్)
విద్యార్హత : బీకాం(హానర్స్), ఎల్.ఎల్.బి, ఢిల్లీ యూనివర్సిటీ
కులం : వంజరి, బీసీ-డి
పదవులు : 2005 నుంచి 2006 వరకు
నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ బార్
అసోసియేషన్ అధ్యక్షుడు, 2009-
2012 వరకు జీహెచ్ఎంసీ ఫ్లోర్
లీడర్, 2009-2014 కార్పొరేటర్,
2018లో ఎమ్మెల్యే.
వృత్తి : న్యాయవాది, రాజకీయం
కూకట్పల్లి
అభ్యర్థి : మాధవరం కృష్ణారావు
తల్లిదండ్రులు : మాధవరం నారాయణరావు,
మాధవరం సక్కుభాయి
పుట్టిన తేదీ : 19/02/1967
భార్య : మాధవరం లక్ష్మీభాయి
పిల్లలు : మాధవరం సందీప్, శ్రీలత
కులం : ఓసీ (వెలమ)
పదవులు : 2000లో మున్సిపల్ వైస్ చైర్మన్,
2014, 2018లో ఎమ్మెల్యేగా విజయం.
వృత్తి : ఆల్విన్‌కాలనీ మాజీ ఉద్యోగి.(భవన నిర్మాణ రంగం)
రాజేంద్రనగర్
అభ్యర్థి : తోలుకంటి ప్రకాశ్ గౌడ్
తల్లి : తోలుకంటి లక్ష్మమ్మ
పుట్టిన తేదీ : 05/5/1959
భార్య : టి.సులోచన
పిల్లలు : టి.జగదీశ్ గౌడ్, టి.శేఖర్‌గౌడ్,
టి.సంతోష్‌గౌడ్, స్వప్నగౌడ్, అండాలు
విద్యార్హత : ఏడవతరగతి, పడాల వెంకట్రామిరెడ్డి ట్రస్టు పాఠశాల ఓల్డ్‌సిటీ
కులం : బీసీ
పదవులు : రాజేంద్రనగర్ సర్కిల్ టీడీపీ అధ్యక్షుడిగా ఐదుసార్లు, 2009,2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపు.
వృత్తి : వ్యాపారం
సనత్‌నగర్
అభ్యర్థి : తలసాని శ్రీనివాస్‌యాదవ్
తండ్రి : టి.వెంకటేశం యాదవ్
పుట్టిన తేదీ : 6/10/1965
భార్య : తలసాని సువర్ణ
పిల్లలు : ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు
విద్యార్హత : ఇంటర్మీడియట్
కులం : బీసీ (యాదవ్)
పదవులు : 1994, 1996, 2001, 2008, 2014, 2018 ఎమ్మెల్యేగా
గెలుపొందారు. కార్మిక శాఖ మంత్రి, టూరిజం శాఖ, కల్చరల్ డిపార్ట్మెంట్ శాఖ
మంత్రి, కమర్షియల్ టాక్స్ విభాగం మంత్రి, సినిమాటోగ్రఫి, మత్య్సశాఖ మంత్రిగా పనిచేశారు.
వృత్తి : రాజకీయం
మహేశ్వరం
అభ్యర్థి : పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి
భర్త పేరు : పట్లోళ్ల ఇంద్రారెడ్డి
పుట్టిన తేదీ : 05/05/1963
పిల్లలు : కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కల్యాణ్ రెడ్డి
విద్యార్హత : గ్రాడ్యుయేషన్(బీఎస్సీ)
కులం : ఓసీ
పదవులు : 2004, 2009, 2018లో
ఎమ్మెల్యేగా గెలుపు. గనులు, ఐటీ, చేనేత,
జౌళి శాఖల మంత్రిగా, హోం,
జైళ్ల శాఖ మంత్రిగా పనిచేశారు.
ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వృత్తి : రాజకీయం
మేడ్చల్
అభ్యర్థి : చామకూర మల్లారెడ్డి
తల్లిదండ్రులు : మల్లారెడ్డి, చంద్రమ్మ
పుట్టిన తేదీ : 09/09/1953
భార్య : చామకూర కల్పన
పిల్లలు : చామకూర మహేందర్ రెడ్డి,
చామకూర భద్రారెడ్డి, మర్రి మమత
విద్యార్హత : ఇంటర్
కులం : ఓసీ
పదవులు : మల్కాజిగిరి ఎంపీ(2014-2018),
మేడ్చల్ ఎమ్మెల్యే(2018), కార్మిక,
ఉపాధి కల్పనా శాఖ మంత్రి
వృత్తి : విద్యావేత్త (మెడికల్, ఇంజినీరింగ్
కళాశాలలు, మల్లారెడ్డి విశ్వ
విద్యాలయం వ్యవస్థాపకులు)
కార్వాన్
అభ్యర్థి : మిత్ర కృష్ణ
తల్లిదండ్రులు : సీతయ్య , గండెమ్మ
పుట్టిన తేదీ : 16/04/1959
భార్య : సునీత
పిల్లలు : అభిషేక్, లిఖిత
విద్యార్హత : బీకాం, ఎల్ఎల్బీ
కులం : ఎస్సీ
పదవులు : రెండుసార్లు
కార్పొరేటర్‌గా విజయం.
ముషీరాబాద్
అభ్యర్థి : ముఠా గోపాల్
తల్లిదండ్రులు : రాజేశ్వరి, రాజయ్య
పుట్టిన తేదీ : 10/02/1953
భార్య : సరోజిని
పిల్లలు : జయసింహ, కుమార్తె
విద్యార్హత : డిగ్రీ
కులం : బీసీ, బెస్త(గంగపుత్ర)
పదవులు : 1982లో కార్పొరేటర్‌గా గెలుపు,
1995 నుంచి 2002 వరకు మూడు సార్లు టీడీపీ నగర అధ్యక్షుడు, హుడా డైరెక్టర్‌గా, కనీస వేతనాల బోర్డు చైర్మన్‌గా, 1995లో ఆర్టీసీ రివిజనల్ చైర్మన్‌గా పని చేశారు. 2014 ఎమ్మెల్యేగా ఓటమి, 2018లో ఎమ్మెల్యేగా గెలుపు.
వృత్తి : వ్యాపారం
మల్కాజిగిరి
అభ్యర్థి : మైనంపల్లి హన్మంతరావు
తల్లిదండ్రులు : కిషన్ రావు, సరోజిని
పుట్టిన తేదీ : 10/01/1966
భార్య : వాణి
పిల్లలు : మైనంపల్లి రోహిత్,
మైనంపల్లి శివాంక్
కులం : ఓసీ (వెలమ)
పదవులు : 2008, 2009,
2018 ఎమ్మెల్యేగా గెలుపు.
2017లో ఎమ్మెల్సీ. 2014లో
ఎంపీగా పోటీ.
వృత్తి : వ్యాపారం
ఉప్పల్
అభ్యర్థి : బండారి లక్ష్మారెడ్డి
తల్లిదండ్రులు : జంగారెడ్డి, లక్ష్మమ్మ.
పుట్టిన తేదీ : 27/11/1976
భార్య : మమత రెడ్డి
పిల్లలు : అఖిల్ రెడ్డి, అలేఖ్య
విద్యార్హత : డిగ్రీ
కులం : ఓసీ
పదవులు : విద్యార్థి నాయకుడిగా, జేఎన్టీయూ
ఈసీ మెంబర్‌గా, కాంగ్రెస్కమిటీ
సెక్రటరీగా పనిచేశారు. సామాజిక
సేవకుడిగా, బీఎల్ఆర్ ట్రస్టు
వ్యవస్థాపకుడిగా సేవలు అందిస్తున్నారు.
వృత్తి : వ్యాపారం
మలక్‌పేట
అభ్యర్థి : తీగల అజిత్ రెడ్డి
తండ్రి : తీగల సుభాష్ రెడ్డి
పుట్టిన తేదీ : 25/02/1974
భార్య : తీగల సునరితారెడ్డి (బీఆర్ఎస్ పార్టీ
మూసారాంబాగ్ డివిజన్
మాజీ కార్పొరేటర్).
పిల్లలు : తీగల కనిష్క్ రెడ్డి, తీగల అక్షిత్ రెడ్డి.
విద్యార్హత : బీడీఎస్
కులం : ఓసీ
పదవులు : 2010లో బీఆర్ఎస్
పార్టీలో చేరారు.
వృత్తి : వ్యాపారం.
కంటోన్మెంట్
అభ్యర్థి : జ్ఞాని లాస్యనందిత
తల్లిదండ్రులు : సాయన్న , గీత
పుట్టిన తేదీ : 07/09/1986
విద్యార్హత : బి.టెక్. కంప్యూటర్ సైన్స్.
కులం : ఎస్సీ
పదవులు : ఒకసారి
కార్పొరేటర్‌గా విజయం.
దివంగత ఎమ్మెల్యే సాయన్న
రాజకీయ వారసురాలిగా
లాస్య నందిత 2015లో
అరంగేట్రం చేశారు.
చార్మినార్
అభ్యర్థి : మహ్మద్ సలావుద్దీన్ లోధి
వయస్సు : 65 ఏళ్లు
రాజకీయం : 2018లో చార్మినార్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ
బహదూర్‌పురా
అభ్యర్థి : మీర్ ఇనాయాత్ అలీ బాక్రి
తండ్రి : మీర్ ఇఫ్తేకర్ అలీ
పుట్టిన తేదీ : 07/06/1970
కులం : మైనార్టీ
నివాసం : ఓల్డ్‌సిటీ
పదవులు : నాలుగు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ.సెట్విన్ చైర్మన్.
యాకుత్‌పురా
అభ్యర్థి : సామ సుందర్ రెడ్డి
తల్లిదండ్రులు : సామ శంకర్ రెడ్డి,సామ సుజాత
పుట్టిన తేదీ : 24/04/1978
భార్య : సామ స్వప్నారెడ్డి. (ఐఎస్ సదన్
డివిజన్ మాజీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్)
పిల్లలు : సామ చరణ్‌రెడ్డి, సామ శ్రేహన్ రెడ్డి
విద్యార్హత : డిగ్రీ.
కులం : ఓసీ
పదవులు : 2009లో కార్పొరేటర్‌గా, 2018 ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ. యాకుత్‌పురా నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా.
చాంద్రాయణగుట్ట
అభ్యర్థి : ముప్పిడి సీతారాంరెడ్డి
తల్లిదండ్రులు : మల్లారెడ్డి, చంద్రమ్మ
పుట్టిన తేదీ : 09/12/1968
కుటుంబ వివరాలు : భార్య, కూతురు.
విద్యార్హత : బి.ఏ
కులం : ఓసీ
పదవులు : బీఆర్ఎస్ పార్టీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం
ఇన్చార్జి. 2014, 2018లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ.
వృత్తి : వ్యాపారం.