సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): బక్రీద్ నేపథ్యంలో గురువారం నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, మీర్ఆలం ట్యాంక్ ఈద్గా వద్ద నిర్వహించబోయే ఈద్ ఉల్ అజ్హా బక్రీద్ ప్రత్యేక ప్రార్ధనల నేపథ్యంలో ఉదయం ఏడు గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే సాయంత్రం 5 గంటలకు అమీర్పేట మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అమీర్పేట మైత్రివనం దాని పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.