ప్రశాంతంగా రంజాన్ వేడుకలు
ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ముస్లింల ప్రార్థనలు పెద్ద ఎత్తున జరిగాయి. హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద ముస్లింలు భారీ సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీరాలంలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
- మీరాలం ఈద్గా వద్ద వేడుకల్లో పాల్గొన్న నగర సీపీ సజ్జనార్
సిటీబ్యూరో, మార్చ్ 21(నమస్తే తెలంగాణ): ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ముస్లింల ప్రార్థనలు పెద్ద ఎత్తున జరిగాయి. హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద ముస్లింలు భారీ సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీరాలంలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ప్రార్థనల అనంతరం ఆయన చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలంతా సుఖసంతోషాలతో, ప్రశాంతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
రంజాన్ మాసమంతా నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల షాపింగ్ అవసరాలకు, ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని, అందరి సహకారంతో వేడుకలు విజయ వంతమయ్యామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సౌత్ రేంజ్ అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, నార్త్‌రేంజ్ జాయింట్ సీపీ శ్వేత, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్‌డేవిస్, కార్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

