చార్మినార్, సెప్టెంబర్ 29: న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని సిటీ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. న్యాయవాది బాలాజీ నడికుడిపై జరిగిన దాడికి నిరసనగా బుధవారం సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. నిరసనలో సిటీ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.లింగం నారాయణ, ఉపాధ్యక్షులు ఎన్.నాగభూషణం, శ్రీలత గోవింద్, ప్రధాన కార్యదర్శి ఈ.కిశోర్‌కుమార్, సంయుక్త ప్రధాన కార్యదర్శి మూల మురళీమోహన్, కోశాధికారి హరిప్రియలతోపాటు ప్రవీణ్‌రెడ్డి, దీప, ప్రీతి గౌడ్, ఆర్.శాంతి, మౌనిక, ఆంజనేయులు, సబిత, యాదయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.