సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) :మానసిక వికలాంగులకు న్యాయసేవాధికార సంస్థ అండగా ఉంటుందని, వారి హక్కుల రక్షణ కోసం ఉచితంగా న్యాయ సేవలు అందిస్తుందని సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి మురళీమోహన్ అన్నారు. ఈ నెల 10న వరల్డ్ మెంటల్ హెల్త్డే సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక ఎర్రగడ్డలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఐఎంహెచ్లో రోగులకు, వారి కుటుంబ సభ్యులకు, సిబ్బందికి సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. న్యాయమూర్తి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉమా శంకర్రావు, డాక్టర్ శిరీష, ఆర్ఎంవో డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.