కొత్త మార్గాల్లో సిటీ బస్సులు..!

- నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న మార్గాలు
- సర్వే నిర్వహిస్తున్న ఆర్టీసీ అధికారులు
- ఆక్యుపెన్సీ పెంపు కోసం ఫోకస్
సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహా నగరం రోజు రోజుకూ విస్తరిస్తున్నది. కొత్తగా పెద్ద పెద్ద కాలనీలు వెలుస్తున్నాయి. ఔటర్ రింగు రోడ్డుకు అవతల కూడా అనేక కొత్త కాలనీలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఆర్టీసీ అధికారులు బస్సులను నడిపించేందుకు కొత్త మార్గాలపై దృష్టిసారించారు. ఇందుకు ప్రత్యేకంగా సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎల్బీనగర్, ఉప్పల్ నుంచి గచ్చిబౌలి మార్గాల్లో నగర ప్రజలకు మెట్రో రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, పెరుగుతున్న కాలనీల్లో ఉండే ప్రయాణికుల కోసం సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు దృష్టి సారించారు.
తోడుగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో రోడ్ల విస్తరణ కూడా వేగంగా జరుగుతున్నది. సిటీ బస్సుల ఆదాయం పెంచుకోవడం, నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా కొత్త మార్గాల్లో బస్సులను తిప్పాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఏయే మార్గాల్లో ఎన్ని బస్సులు నడిపించాలి..? ఆ బస్సులలో ఆక్యుపెన్సీ వస్తుందా..? మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు లింక్ బస్సులు ఏర్పాటు చేయాలా..? రోజులో ఎన్ని బస్సులు నడిపించాల్సి ఉంటుంది..? వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. ప్రయోగంగా కొన్ని మార్గాల్లో కూడా బస్సులను నడిపించి, సగటు ఆక్యుపెన్సీ ఎలా వస్తుంది అన్న అంశాలపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు.
కొత్త మార్గాల్లో బస్సులు..
కొత్త మార్గాల్లో బస్సులను నడిపించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా కూకట్పల్లి నుంచి చౌటుప్పల్ వరకు, ఈసీఐఎల్ నుంచి మేడ్చల్ వరకు సిటీ బస్సు సర్వీసులను పొడిగించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆర్టీసీ జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

