జవహర్‌నగర్, మార్చి 28: దేశ భద్రతలో సీఐఎస్ఎఫ్ కమాండోలు నిబద్ధతతో కూడిన సేవలదించాలని, కార్యదీక్షతతో సమాజాభివృద్ధిలో భాగస్వాములైతేనే ప్రత్యేక గుర్తింపు వస్తుందని సీఐఎస్ఎఫ్ ఏపీఎస్ స్పెషల్ డైరెక్టర్ ప్రవీర్ రన్జన్ ఐపీఎస్ పిలుపునిచ్చారు.
శుక్రవారం హకీంపేట్‌లోని నీసా నేషనల్ ఇండస్ట్రీయల్ అథారిటీ దీక్షంత్ పరేడ్ మైదానంలో శిక్షణ పొందిన 37వ బ్యాచ్ అసిస్టెంట్ కమాండోలు 69మంది పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాప్రవీర్ రన్జన్ ఐపీఎస్ హాజరై అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కమాండోలకు అవార్డులతో పాటు ట్రోఫీలను అందజేశారు. ఈకార్యక్రమంలో నీసా డైరెక్టర్ ఎస్ ఆర్ శరవరణ్ ఐపీఎస్, అధికారులు, కమాండోల తల్లిదండ్రులు, నీసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.