కాప్రా, మే 26: అమెరికాలో జరిగిన మిస్ తెలుగు యూఎస్ఏ-2025 పోటీల్లో కాప్రా ఏఎస్రావు నగర్‌లోని భవానీనగర్‌కు చెందిన చూర్ణికా కొత్తపల్లి రన్నర్ అప్‌గా నిలిచింది. ఏప్రిల్‌లో ఫైనల్ పోటీలకు ఎంపికైన చూర్ణిక డల్లాస్‌లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11.30 గంటలకు) నిర్వహించిన టైటిల్ పోటీల్లో రన్నర్ అప్‌గా (ద్వితీయ స్థానం) నిలిచింది. దీనికి తోడు పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకొని రెండు కిరీటాలను సొంతం చేసుకొన్న చూర్ణిక కొత్తపల్లిని.. ఆయన తండ్రి కొత్తపల్లి రాంబాబు (బిల్డర్, లయన్స్ క్లబ్ ప్రతినిధి), కుటుంబ సభ్యులకు యూఎస్ఏలోని తెలుగువారితో పాటు రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చూర్ణిక తండ్రి కొత్తపల్లి రాంబాబు మాట్లాడుతూ.. టైటిల్ పోటీల్లో తుదివరకు పోరాడిన తన కూతురు రన్నర్అప్గా నిలువడం సంతోషంగా ఉందని అన్నారు. కృషి, ప్రతిభ, ధైర్యంతో పాటు రెండు రాష్ర్టాల అభిమానుల మద్దతుతో ద్వితీయస్థానం (రన్నర్ అప్) సాధించడంతో పాటు, పీపుల్స్ ఛాయిస్‌లో విజయం సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. తన కూతురుకు ఓటుతో మద్దతు తెలిపిన వారందరికీ రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. చూర్ణిక ప్రస్తుతం ఫ్లోరిడాలో ఎంఎస్ చదువుతోంది.