రవీంద్రభారతి/సుల్తాన్‌బజార్, ఆగస్టు 9: సీనియర్ పాత్రికేయులు, హైదరాబాద్ చరిత్ర గ్రంథకర్త ఎస్‌ఎన్‌రావు రచించిన ఫేమస్ పీపుల్ ఆఫ్ తెలంగాణ-2020 పుస్తకాన్ని సోమవారం భాస్కర ఆడిటోరియంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ గత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరికి ఉందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు తెలంగాణ ఉద్యమం సాగిందని వివరించారు. ఫేమస్ పీపుల్ ఆఫ్ తెలంగాణ పుస్తకాన్ని ఎస్‌ఎన్‌రావు రాయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఎస్ఎన్ పబ్లికేషన్ పలువురు ప్రముఖులకు తెలంగాణ వైభవం పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో వి. రాజన్న, కె. నర్సింహమూర్తి, డాక్టర్ కాసు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
ఏడు కిలోల బరువు, 1140 పేజీలు ఉన్న పీపుల్ ఆఫ్ ఫేమస్ తెలంగాణ-2020 పుస్తకంలో వంద మంది ప్రముఖుల పేర్లను చేర్చారు. ముఖ్యంగా ఈఎన్టీ విభాగంలో విశేష సేవలందించిన ఉస్మానియా మెడికల్ కాలేజీ ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ ఎల్. సుదర్శన్‌రెడ్డికి ఈ పుస్తకంలో చోటు దక్కింది. తాను అందిస్తున్న సేవలను గుర్తించి అరుదైన గౌరవం ఇచ్చిన పీపుల్ ఆఫ్ ఫేమస్ తెలంగాణ-2020 పుస్తక రచయిత ఎస్ఎన్రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.