హైదరాబాద్: గోల్కొండలోని (Golconda) ఇబ్రహీం బాగ్‌లో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు.. మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న చిన్నారి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. ఆమె తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కారులో ఉన్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన గోల్కొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.