Cm relief fund | ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
గోల్నాక : పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి వరంలా మారిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.
అంబర్‌పేట ఆంధ్రకాలనీకి చెందిన విజయ్‌కుమార్‌కు రూ.3లక్షలు, నారాయణగూడ శివాజీనగర్‌కు చెందిన టి.నిర్మలకు రూ.1లక్షా 50వేలు, బాగ్‌అంబర్‌పేట తురాబ్‌నగర్‌కు చెందిన ప్రసూనకు రూ.రూ.1లక్ష, అదే ప్రాంతానికి చెందిన నాగార్జునకు రూ.26వేలు, తిలక్‌నగర్‌కు చెందిన లావణ్యకు రూ. 20వేలు మొత్తం రూ.5లక్షల 96వేల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

