మలక్పేట, మే 18 : మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని తీగలగూడలోని మూసీ బెడ్ పక్కన బుధవారం ఉదయం గుర్తు తెలియని మొండెం లేని మహిళ తలను మలక్పేట పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై పోలీసులు పలు టీమ్లతో భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
అయితే ఈ గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడో హతమార్చి తలను తెచ్చి తీగలగూడలోని మూసీ బెడ్ పక్కన పడేసి వెళ్లారని, మహిళను గుర్తు పట్టిన వారుగానీ, ఆమె గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే 8712661 267, 8712 660570,8712660577కు సమాచారం ఇవ్వాలని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.