ఖైరతాబాద్, ఆగస్టు 7: పవిత్ర శ్రావణ మాసంతో పాటు వ్రతాల సంబురాల సన్నాహాలు మొదలైన వేళ హైదరాబాద్ నగరంలో చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మహిళలకు మరుపురాని షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం సందర్భంగా చీరలు, ఆభరణాలపై ప్రత్యేక రాయితీలను ప్రకటించి, వినియోగదారుల మనసు దోచుకుంటున్నది. పెళ్లిళ్లకు తగిన శ్రేష్ట్ర వస్ర్తాలు, శ్రావణ మాసపు సంప్రదాయాన్ని ప్రతిబింబించే పట్టు చీరలు, అలంకరణలతో మెరిసే నగలతో చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ వినియోగదారులకు అన్ని రకాల సేవలను ఒకే చోట అందిస్తోంది.
ప్రత్యేక రాయితీలు…
పట్టు, ఫ్యాన్సీ చీరలపై 51శాతం వరకు తగ్గింపు ఇస్తూనే..,కల్యాణి పట్టు, లైట్ వేయిట్ పట్టు, జరీ టిష్యూ, బనారస్ సిల్క్స్, రాయల్ షిఫాన్, మార్బుల్ శారీస్ వంటి అనేక రకాల వస్ర్తాలను తగ్గింపు ధరల్లోనే అందిస్తున్నది. కిడ్స్వేర్, చుడీదార్, మేన్స్వేర్లో అద్భుతమైన ఆఫర్లతో ఇంటిల్లిపాది అందరికి అందుబాటులో ధరల్లో అందిస్తోంది.
ఆభరణాలకు నెలవు…
వరలక్ష్మి వత్రాన్ని పురస్కరించుకొని అందమైన, ఆకర్షణీయమైన బంగారు ఆభరణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ధగధగలాడే బంగారు నగలపై మేకింగ్ చార్జీలకు రాయితీలు, వెండి ఆభరణాలపై మజూరీ లేకుండా ప్రత్యేక డిజైన్ల ఆఫర్లు, దేశ నలుమూలల నుంచి ప్రత్యేక డిజైన్లను ఎంపిక చేసి అందరికీ నచ్చేలా నగల రూపకల్పన చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.