సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): వాట్సాప్, ఈ-మెయిల్లతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేసిన ఏపీకే ఫైల్స్, exe ఫైల్లతో సైబర్ దాడి జరిగే అవకాశమున్నదని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత తెలిపారు. ఫిషింగ్ ఈ మెయిల్స్, నకిలీ లాగిన్ పేజీలు, డేంజర్ అటాచ్మెంట్స్ వంటి అధునాతన వ్యూహాలతో సైబర్ దాడులు జరుగుతాయని తమకు సమాచారమున్నట్లు చెప్పారు.
ముఖ్యంగా ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ అనే వైరస్ అత్యంత ప్రమాదకరమైందని, ఈ మాల్వేర్ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి ఇన్స్టాల్ అయితే వ్యక్తిగత, బ్యాంక్ సమాచారంతో సహా రహస్య సమాచారమంతా పూర్తిగా సైబర్ మోసగాళ్ల చేతిలోకి పోతుందని హెచ్చరించారు.