కేపీహెచ్‌బీ కాలనీ, మే 30 : తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం కీలకపాత్ర పోషించిందని, దీనిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జేఎన్టీయూహెచ్లోని జేఎన్ ఆడిటోరియంలో మహాకవి గుంటూరు శేషేంద్రశర్మ 16వ వర్ధంతి సందర్భంగా సాహిత్య సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి, ప్రముఖ కవి వెల్దండి శ్రీధర్, ప్రొఫెసర్ రఘు, సినీ నటులు ఎల్.బీ.శ్రీరామ్, ఎస్.శివారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి హాజరై పలు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ వేదికపై కాఫీ టేబుల్ బుక్ రచయిత లంకా శివరామప్రసాద్‌కు శేషేంద్ర జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ కన్వీనర్ సురేశ్‌కుమార్, శేషేంద్ర మెమోరియల్ ట్రస్ట్ కన్వీనర్ సాత్యకి, రమాచంద్రమౌళి పాల్గొన్నారు.