ఏఐటీయూసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు యూసుఫ్
జీడిమెట్ల, ఏప్రిల్ 9 : శ్రమ జీవులను మోసం చేస్తూ, కార్మికుల చట్టాలను కాలరాస్తూ పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎండి.యూసుఫ్ అన్నారు. శనివారం జీడిమెట్ల పారిశ్రామి కవాడలో ఉన్న ఏఐటీయూసీ పొట్లూరి నాగేశ్వర్రావు భవన కార్యాలయంలో నిర్వహించిన హమాలీ కార్మికుల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులంతా ఏకమై కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి కార్మిక రాజ్య స్థాపన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం హమాలీ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉజ్జిని హరినాథ రావు, అధ్యక్షుడిగా యండి. యూసుఫ్, ప్రధాన కార్యదర్శిగా కె.స్వామి, కోశాధికారిగా నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షులుగా బి.రాము, సంయుక్త కార్యదర్శిగా సుంకిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరిగా డి. చంద్రమౌళిను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌తో పాటు హమాలీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.