సిటీబ్యూరో, మార్చి 10(నమస్తే తెలంగాణ) : శాస్త్ర, సాంకేతిక రంగంలో మహిళల పాత్ర అంశంపై సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సెమినార్ జరగనున్నది. ఈనెల 13న సీడీఎఫ్డీలోని సెమినార్ హాల్లో నిర్వహించే ఈ సదస్సులో ముఖ్య అతిథిగా వీ హబ్ సీఈవో దీప్తిరావు ప్రసంగించనున్నారు.
ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సదస్సు ద్వారా స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యథమెటిక్స్ ) రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నట్లుగా సీడీఎఫ్‌డీ వర్గాలు వెల్లడించాయి.
అలాగే ఈ నెల 18న సెల్ బయాలజీపై అంతర్జాతీయ సదస్సు జరగనున్నది. ‘సిస్టమ్స్ బయాలజీ ఇన్ సింగిల్ సెల్స్.. ఏ టేల్ ఆఫ్ టూ వైరసెస్’ పేరిట నిర్వహించనున్న ఈ సదస్సులో దేలేవర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అభ్యుదయ్ సింగ్ ప్రసంగించనున్నారు. హెచ్ఐవీ జన్యు క్రమంపై చర్చించనున్నారు.