Allapur Division | అల్లాపూర్: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని చిత్తు చేసి బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో అల్లాపూర్‌లో బీజేపీ నేతల సంబురాలు మిన్నంటాయి. శనివారం ఢిల్లీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అల్లాపూర్‌కు చెందిన బీజేపీ నేతలు శ్రీ వివేకానంద నగర్ ప్రధాన కూడలి వద్ద పటాకులప్ల్చేరు. స్థానికులకు మిఠాయిలు పంచి పెట్టారు. జై శ్రీరామ్, జై నరేంద్ర మోదీ అంటే నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారు మోగింది. కార్యక్రమంలో బీజేపీ నేతలు నార్లపురం శ్రీనివాస్, గోనెల సుదర్శన్ ముదిరాజ్, వెంకట్రాంరెడ్డి, సత్యనారాయణ నాగరాజు గౌడ్, జిత్తు తదితరులు పాల్గొన్నారు.