ముషీరాబాద్, మార్చి 9: జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న మహిళలకు నవరత్న మహిళా పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ముఖ్య అతిథిగా పాల్గొని తొమ్మిది మంది మహిళా ప్రముఖులకు పురస్కారాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, చిల్లా రాజశేఖర్రెడ్డి, సి.రామకృష్ణ, రామరాజు లక్ష్మీశ్రీనివాస్, కుసుమ భోగరాజు, గిడుగు కాంతికృష్ణ, ఎస్.రామచంద్రరావు, విజయలక్ష్మి, జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ నిర్వాహకుడు వెంకటరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు నాట్యగురువు డాక్టర్ కె.నిర్మలా విశ్వేశ్వరరావు శిష్యులు రుచిత, గాయత్రి, ఆరాధ్య, దీప్తిశ్రీ, హిషిక కూచిపూడి నృత్య ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది.