టీబీపై సీసీఎంబీ అధ్యయనం
టీబీపై సీసీఎంబీ పరిశోధనలు ముమ్మరం చేసింది. వ్యాధి నియంత్రణయే లక్ష్యంగా కొంత కాలంగా టీబీ బ్యాక్టీరియా జీవక్రియలను పరిశోధిస్తున్నారు. మైక్రో బ్యాక్టీరియం ట్యూబరోక్యూలోసిస్ వల్ల ఊపిరితిత్తులు ఏ విధంగా ప్రభావితమవుతున్నాయి..
సిటీబ్యూరో: టీబీపై సీసీఎంబీ పరిశోధనలు ముమ్మరం చేసింది. వ్యాధి నియంత్రణయే లక్ష్యంగా కొంత కాలంగా టీబీ బ్యాక్టీరియా జీవక్రియలను పరిశోధిస్తున్నారు. మైక్రో బ్యాక్టీరియం ట్యూబరోక్యూలోసిస్ వల్ల ఊపిరితిత్తులు ఏ విధంగా ప్రభావితమవుతున్నాయి..? మానవ రోగ నిరోధకతను ఏ విధంగా తట్టుకుంటున్నాయి..? వంటి విషయాలను తెలుసుకునేందుకు ఈ పరిశోధనలు చేస్తున్నట్లు సీసీఎంబీ వర్గాలు వెల్లడించాయి.
అత్యంత క్లిష్టమైన, అతి సున్నితమైన ఊపిరితిత్తులోని అంతర భాగాలను నిర్వీర్యం చేయడంలో ఈ బ్యాక్టీరియా వేగంగా తమ రూపాన్ని మార్చుకుంటున్నదని, అదే సమయంలో రోగనిరోధకతను తట్టుకునేలా బలోపేతంగా మారుతున్నదని గుర్తించారు. అందుకే తమ పరిశోధనల్లో అత్యంత సంక్లిష్టమైన చికిత్స విధానాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పరిశోధనలు కొంత కాలంగా సాగుతున్నాయని, వచ్చే ఏడాదిలో జాతీయస్థాయిలో పరిశోధన బృందం ఆధ్వర్యంలో జరిగే ఈఎంబీవో సమావేశంలో టీబీ నియంత్రణ, అధ్యయన తీరు తెన్నులపై చర్చించనున్నట్లు సీసీఎంబీ వర్గాలు పేర్కొన్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

