జీడిమెట్ల, జూలై 9: మార్కండేయనగర్లో బుధవారం పోలీసులు నాకాబందీ, కార్డెన్ సెర్చ్ నిర్వహించిన కాసేపటికే రాత్రి సమయంలో అక్కడి ఏటీఎంటలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాలు.. దుండగులు మార్కండేయనగర్‌లోని గల హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలోని డబ్బులు పెట్టే బాక్స్‌ను గ్యాస్ కట్టర్స్ సహయంతో కట్‌చేసి ఎత్తుకెళ్లారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే డబ్బుల పెట్టెలో ఎంత నగదు ఉందో తెలియాల్సి ఉంది.