కవాడిగూడ : ఇద్దరు వ్యక్తులు గొడవపడి వారిలో ఒకరు తాగిన మైకంలో మరో వ్యక్తికి చెందిన హోండా యాక్టీవా మోపెడ్‌ను దహనం చేసిన ఘటన ఆదివారం గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం…భోలక్‌పూర్‌కు చెందిన శ్రీకాంత్, ప్రవీణ్‌లు ఇద్దరు కలిసి మధ్యం సేవించారు.
ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో శ్రీకాంత్ అనే వ్యక్తికి చెందిన హోండా యాక్టీవా మోపెడ్‌ను ప్రవీణ్ అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి 12 గంటలకు పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు ఆయన తెలిపారు. బాధితుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మోహన్ రావు తెలిపారు.