బంజారాహిల్స్,ఏప్రిల్ 17: మహిళా వ్యాపారవేత్తకు చెందిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఘటనలో నిందితులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న మహిళా వ్యాపారవేత్తకు చెందిన ఇన్స్టాగ్రామ్లో ఆమె ఫొటోలు అసభ్యకరంగా మార్పింగ్ చేయడంతో పాటు ఫోన్ నెంబర్ పెట్టి ట్యాగ్ చేశారు.
అమెతో పాటు మరో మహిళా ఉద్యోగి ఫొటోలను సైతం ఇదే విధంగా పోస్ట్ చేసిన విషయాన్ని గుర్తించిన బాధిత మహిళా వ్యాపారవేత్త బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తమ వద్ద పనిచేసి మానేసిన ఓ యువతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.