Hayatnagar | హయత్‌నగర్, అక్టోబర్ 23: గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్దాలను పగులగొట్టి రూ. 2 లక్షలు నగదు ఎత్తుకెళ్లిన ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్, చింతలకుంట, సరస్వతీనగర్‌కు చెందిన వాకిటి సుధాకర్‌రెడ్డి(33) హయత్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్లాటు రిజిస్టేషన్ కోసం స్నేహితుడి కారులో వచ్చాడు.
డాక్యుమెంట్ తయారీ కోసం సుధాకర్‌రెడ్డి వెళ్లి వచ్చేసరికి.. కారులో ఉన్న రూ.2 లక్షలు కనిపించలేదు. ఆగంతకులు కారు వెనుక అద్దాలు పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు గుర్తించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.