హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ప్రమాదం తప్పింది. నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంజన్ సహా కారు ముందుభాగం పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్, మరో వ్యక్తి వెంటనే కారులో నుంచి దిగిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఉప్పల్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న శ్రీధర్, లిక్షిత్ క్షేమంగా బయటపడ్డారని చెప్పారు.
మరో ఘటనలో బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. దుర్గాభవానీనగర్‌లో ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో భారీఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ అగ్నిప్రమాదంలో భారీగ ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబీకులు వెల్లడించారు.