ముంబై, సెప్టెంబర్ 28 : టాటా సన్స్ ను దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదు చేయడానికి ససేమిరా అంటున్న టాటా ట్రస్ట్స్.. మరో ప్లాన్‌ను ముందుకు తెచ్చింది.
అనుబంధ సంస్థలైన టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ కంపెనీలను టాటా సన్స్‌లో విలీనం చేయాలని సోమవారం ప్రతిపాదించింది. ఆర్బీఐ నుంచి ఎన్వోసీని తీసుకోవాలని టాటా సన్స్ బోర్డుకు సూచించింది.