హైదరాబాద్ : మైలార్దేవ్పల్లిలో(Mailardevpally)గంజాయి ముఠా(Cannabis gang) రెచ్చిపోయింది. కటింగ్ చేసిన తర్వాత డబ్బులు అడిగినందుకు సెలూన్ షాప్(Salon shop) నిర్వాహకుడిపై విచక్షణారహితంగా దాడికి(Attacked )పాల్పడ్డారు. సెలూన్లోని ఫర్చీచర్ ధ్వం చేశారు. సదరు యజమానిపి భౌతిక దాడికి పాల్పడ్డారు. తమనే డబ్బులు అడుగుతావా అంటూ ముగ్గురు దుండగులు దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా అడ్డు వచ్చిన స్థానికులపై సైతం దాడికి తెగపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే గంజాయి ముఠా అక్కడి నుంచి పారిపోయింది. గంజాయి మత్తులో తమ పైనా దాడులు చేస్తున్నారని గస్తీ పెంచి పోకిరీల ఆగడాలను అరికట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గంజాయి ఎవరైనా అమ్మినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయిస్తే పోలీసులకు తెలుపాలన్నారు.