Ganja Chocolates | సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్ కేంద్రంగా నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశా రు. నిందితుడి వ ద్ద నుంచి రూ.2లక్షల విలువ చేసే 24కిలోల గంజా యి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆబ్కారీ ఈడీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం…రాజస్థాన్ ప్రాంతానికి చెందిన గోరక్ సాహె ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి కూకట్‌పల్లిలో నివాసముంటున్నాడు. కూలీ పనిచేసే గోరక్ వచ్చే ఆదాయం సరిపోక సొంతప్రాంతంలో తక్కువ ధరకు లభించే గంజాయి చాక్లెట్లను రైలు మార్గం ద్వారా నగరానికి తీసుకువచ్చి విక్రయించడం మొదలు పెట్టాడు.
ఈ మేరకు సమాచారం అందుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం కూకట్‌పల్లిలోని పలు చోట్ల నిఘా పెట్టారు. అదే సమయంలో గోరక్సాహె స్థానికంగా గంజా యి చాక్లెట్లు విక్రయిస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. నిందితుడి వద్ద నుంచి రూ.2లక్షల విలువైన 120గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఒక్కో ప్యాకెట్లో 40మత్తు చాక్లెట్లు ఉం టాయని, ఒక్కో చాక్లెట్‌ను స్థానికంగా రూ.40ల చొప్పున విక్రయిస్తున్నట్లు నిందితుడు అధికారుల విచారణలో వెల్లడించాడు. నిందితుడిని పట్టుకున్న వారిలో ఎస్టీఎఫ్ సీఐలు చంద్రశేఖర్, భిక్షారెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజు, తదితరులున్నారు.