RS Praveen kumar | పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులే అరెస్ట్ చేశారు.. రోడ్డు మధ్యలో అతన్ని కస్టడీలోకి తీసుకుని మేం అరెస్ట్ చేసినమని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలా..? రాజకీయ నాయకులా మాట నమ్మాలా అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడంపై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మేం బండి సాయి భగీరథ్‌ను మేం అరెస్ట్ చేశామని అంటున్నారు. మరోవైపు నేనొక బాధ్యతాయుతమైన మంత్రిగా, రాజకీయ నాయకుడిగా నా కొడుకును నేనే నా లాయర్ల ద్వారా పోలీసులకు సరెండర్ చేశానని చాలా స్పష్టంగా బండి సంజయ్ ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు. తర్వాత నిన్న కూడా బండి సంజయ్ బీజేపీ పార్టీ ఆఫీసుకు పోయి అదే మాట చెప్పారు. కానీ సీఎం మాత్రం ఇవాళ కొత్త అబద్దాన్ని మనముందటికి తీసుకొస్తుండు.. మేం బండి సాయి భగీరథ్‌ను అరెస్ట్ చేశాం. అతడు లొంగిపోలేదు అంటున్నారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిని నమ్మలా..? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని నమ్మాలా..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
అరెస్ట్ చేస్తే చుట్టూ ఎస్వోటీ పోలీసులుండాలి..
ఇవాళ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. బండి సాయి భగీరథ్ మీద మే 8న కేసు నమోదైంది. దాని తర్వాత పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఆ తర్వాత బండి సాయి భగరీథ్ను పట్టుకునేందుకు రకరకాల పోలీస్ బృందాలను ఢిల్లీకి, హైదరాబాద్‌కు, కరీంనగర్‌కు పంపించాం. అదే విధంగా లుకౌట్ సర్క్యూలర్ కూడా జారీ చేశాం. సైబరాబాద్ ఎస్ఓటీ టీం మంచిరేవుల గ్రామం దగ్గర ఒక టెక్ పార్క్ దగ్గర నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మే 16న 8:15 నిమిషాలకు అరెస్ట్ చేశామంటున్నరు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆయన చుట్టూ ఉండేవాళ్లు ఎస్వోటీ పోలీసులుండాలి. ఎస్వోటీ పోలీసుల పహారాలో లేదంటే ఆలీవ్ గ్రీన్ దుస్తుల్లో ఉన్న కమాండోల పహారాలో పోలీస్ వాహనాల్లో ఆ నిందితుడిని పీఎస్‌కు తీసుకొచ్చిఅక్కడి నుంచి అరెస్ట్ కార్డు ఇష్యూ చేసి ఆ నిందితుడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి మెడికల్ చెకప్ పూర్తయ్యాక మేజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్తరు… అని పోలీస్ మాన్యువల్ చెప్తున్నదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .
నాకాబంది ఏర్పాటు చేసి మేం ఆ నిందితుడిని అరెస్ట్ చేశామని సీఎం చెప్తున్నరు కదా.. నాకాబంది ఏర్పాటు చేసినప్పుడు అందులో ఉండాల్సినవాళ్లు పోలీసులు.. ఎస్వోటీ అయితే సాధారణ దుస్తుల్లో ఉండే పోలీసులు లేకపోతే ఆలీవ్ గ్రీన్ వేసుకున్న కమాండోలుండాలి. లేకపోతే సాయుధులైన పోలీసులుండాలి. ఖాకీ దుస్తులేసుకున్న పోలీసులుండాలి.. పోలీస్ వాహనాల్లో పోవాలి. బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయినప్పుడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు మాస్క్ పెట్టుకుని ఇద్దరు అడ్వకేట్ల పహారాలో పోయిండు. పోలీస్ దుస్తులున్న వ్యక్తులు కానీ కమాండోలు కానీ సాయుధులైన పోలీసులు కానీ లేరని చెప్పుకొచ్చారు.
Live: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం@RSPraveenSwaero https://t.co/2nPnZ1JN5Y
— BRS Party (@BRSparty) May 21, 2026
బండి భగీరథ్ లొంగిపోయాడని బండి సంజయ్ అబద్ధాలు చెప్తే మీరు ఎలా నమ్ముతారు
మా పోలీసులు అరెస్ట్ చేశామని చెప్పారు, నేను అదే నమ్ముతాను
– రేవంత్ రెడ్డి https://t.co/xnPOtgUHKi pic.twitter.com/cpOGIsNBkX
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2026