ఉస్మానియా యూనివర్సిటీ: పని కోసం వచ్చి ఇంట్లో నగలు దొంగలించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయపురి కాలనీలో ఉండే వెంకటేశ్వర్లు ఇటీవల విజయపురి కాలనీలో ఒక అపార్ట్మెంట్లోని ప్లాట్ ని కొనుగోలు చేసి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. వారికి ఇంటి పనిమనిషి అవసరమని తెలుసుకొని గత నెల 31న ఇద్దరు ఆడవాళ్లు వాళ్ల ఇంటికి వెళ్లి తాము దగ్గరలోనే ఉంటామని పనిచేస్తామని తెలిపారు. నమ్మిన వెంకటేశ్వర్లు వాళ్లని పనిలోకి తీసుకుంది. అదే రోజు వారు హడావుడిగా పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా యజమానురాలు వారి ఫోన్ నెంబర్లు, చిరునామా అడిగినా, తర్వాత ఇస్తామని దాటేసి వెళ్లిపోయారు.
వారు వెళ్లిపోయాక బీరువాలో భద్రపరిచిన రెండు జతల బంగారు చెవి పోగులు, బంగారు గొలుసులు, ఒక బంగారపు ఉంగరం దొంగిలించారని యజమానురాలు గమనించింది. దీంతో వెంకటేశ్వర్లు లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ రఘుబాబు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో క్రైమ్ సిబ్బంది చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు గాలించి నిందితులను పట్టుకున్నారు. నేరానికి పాల్పడిన బోయ రషీద ను అదుపులోకి తీసుకొని చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను చంచల్గూడ జైలుకు పంపించారు.