సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): శీతాకాలంలో చలితీవ్రత, పొగమంచు కారణంగా వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. చీకటి వేళల్లో పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ఆ సమయంలో దగ్గరి దగ్గరి వాహనాలే కన్పించవు.. ఒక వాహనా నికి మరో వాహనం కన్పించక ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై రాకపోకలు సాగించేవారు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంటుంది. ప్రమాదాలు రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరు గుతుంటాయి.. పొగమంచు వేళ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంటుంది… ఈ విషయంలో వాహనాలు వాహనదారులు రోడ్డు ప్రమాదా లను నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ పోలీసులు సూచిస్తున్నారు.
అప్రమత్తతోనే ప్రమాదాలకు చెక్..
సహాయం చేసిన వారికి రూ. 25 వేలు ..
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నాం. శీతాకాలంలో చలితీవ్రత, పొగమంచు కారణంగా వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఒక గంటలోపల బాధితులకు ఎవరైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించి వాళ్ల ప్రాణాలను కాపాడితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుడ్ సమారిటన్ పథకం కింద రూ. 25 వేల నగదును సదరు వ్యక్తులకు అందిస్తాం. వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రతను బాధ్యతగా భావించి నియమ నిబంధనలు పాటించడంతో ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చు. పోలీసు శాఖ, ప్రజలు కలిసి పనిచేస్తే సురక్షితమైన రహదారులను నిర్మించడం సాధ్యమవుతుంది.
– సుధీర్‌బాబు, రాచకొండ సీపీ