అతడు తెంపుకొస్తే.. ఇతడు కొంటాడు
ల్యాండ్ మాఫియా..డ్రగ్స్ మాఫియాలా ఇప్పుడు చైన్ స్నాచింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాదికి చెందిన ముఠాలు గొలుసు చోరీలకు తెగబడుతున్నాయని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్
అబ్దుల్లాపూర్‌మెట్ చైన్ స్నాచింగ్ ఘటనలో కొత్తకోణం
యూపీ నుంచి పిలిపించి హేమంత్‌తో స్నాచింగ్‌లు
తస్కరించిన నగలను కొంటున్న మనీశ్ కుమార్
ఓఎల్ఎక్స్లో వాహనం కొని మరీ చోరీలు
గుట్టురైట్టెన ఉత్తరాదిముఠాల మాఫియా బాగోతం
సిటీబ్యూరో, మార్చి 31: ల్యాండ్ మాఫియా..డ్రగ్స్ మాఫియాలా ఇప్పుడు చైన్ స్నాచింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాదికి చెందిన ముఠాలు గొలుసు చోరీలకు తెగబడుతున్నాయని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న చైన్‌స్నాచింగ్ ఘటనతో నగరంలోని ఈ వ్యవహారం గుట్టరట్టయింది.
స్నాచింగ్‌ల కోసం..
యూపీకి చెందిన మనీశ్ కుమార్ అగర్వాల్, హేమంత్‌కుమార్ స్నేహితులు. మనీశ్ నగరంలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత 2013, 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంటున్న హేమంత్‌కుమార్‌ను పిలిపించి.. చైన్‌స్నాచింగ్‌లు చేయించాడు. అలా తెంపుకొచ్చిన బంగారం గొలుసులకు నగదు ఇచ్చేసి.. వాటిని కరిగించి తిరిగి మనీష్ అధిక ధరలకు అమ్ముకున్నాడు. ఇలా హేమంత్ కుమార్ గుప్తా దాదాపు హైదరాబాద్ పరిధిలో నాలుగు గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు దొరికాడు.
బైక్‌కు 13 వేల రూపాయలు..
మనీశ్ పిలవడంతో హేమంత్‌కుమార్ సోమవారం నగరానికి వచ్చాడు. ఓఎల్ఎక్స్లో పల్సర్ బైక్‌ను 26 వేల రూపాయాలకు కొనుగోలు చేశాడు. దీనికి మనీశ్‌కుమార్ అగర్వాల్ రూ. 13 వేలు చెల్లించాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో స్నాచింగ్ చేసి చెక్కేశాడు. అయితే గొలుసును మనీశ్‌కు ఇద్దామనుకుంటే..అతడు నగరంలో లేకపోవడంతో హేమంత్ పోలీసుల దృష్టిని మళ్లించేందుకు అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి పలు ప్రాంతాల్లో తిరిగాడు. తెలిసిన వ్యక్తితో ఆన్లైన్లో ఢిల్లీ ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేయించాడు. తస్కరించిన నాలుగుతులాల బంగారం గొలుసును సాక్స్‌లో పెట్టేసి.. షూస్ వేసుకుని విమానం ఎక్కాడు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు. మరోసారి హేమంత్‌కుమార్‌ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని పోలీసులు చైన్ స్నాచింగ్ మాఫియా గుట్టును బయటపెట్ట్టనున్నారు. మనీశ్ కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Abdullapurmet
- arrested
- Buyer
- Case
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

