ఉప్పల్: నాచారంలోని ఎస్టీపీని ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించనున్నారు.
ఈ మేరకు పార్టీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, డివిజన్ల నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పార్టీ ప్రతినిధులు సూచించారు. ఎస్టీపీ వద్దకు ఉదయం 8 గంటలకు కేటీఆర్ రానున్నట్లు తెలిపారు.