ఉప్పల్: హమాలీ కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో సోమవారం సివిల్ సైప్లె హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హమాలీ శ్రీనివాస్ ఆధ్యక్షతన నిర్వహించిన సివిల్ సైప్లె హమాలీ కార్మికుల 18వ ఆవిర్భావ దినోత్సవానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హమాలీ కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం కృషి చేయాలన్నారు.
బీఆర్ఎస్ హయాంలో హమాలీ కార్మికులకు వేతనాలు పెంచామని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కార్మికులకు చేసిందేమి లేదని, డబ్బులు కూడబెట్టి ఢిల్లీ పెద్దలకు పంపడానికే సీఎంకు టైం సరిపోవడం లేదన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని.. రెండు సంవత్సరాలు ఓపిక పడితే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థ్ధిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న హమాలీ కార్మికుల సేవలు అమూల్యమైనవని అన్నారు.
ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికుల గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశం, మల్కాజిగిరి పార్లమెంట్, నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హమాలీ శ్రీనివాస్, బీఆర్టీయూ రాష్ట్ర నేత రాంబాబు యాదవ్, వేముల మారయ్య, మాజీ కార్పొరేటర్లు దేవేందర్‌రెడ్డి, రామారావు, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుదాస్, గీతా ప్రవీణ్ ముదిరాజ్, బీఆర్స్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, సాయిజన్‌శేఖర్, ప్రవీణ్ ముదిరాజ్, గంధం నాగేశ్వర్రావు, కాప్రా, చర్లపల్లి డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు నేమూరి మహేష్‌గౌడ్, భైరి నవీన్‌గౌడ్, నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ, వాసుగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు.

Ktr
హమాలీ నేత మనువడికి కేసీఆర్ పేరు
హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హమాలీ శ్రీనివాస్ మనువడు సెప్టెంబర్ 17న జన్మించడంతో కేసీఆర్ పేరు వచ్చే విధంగా కురుమ చరణ్ రాజ్ (కేసీఆర్) అని పేరు పెట్టుకోవడంపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌ను మరిచిపోకుండా గుండెల్లో పెట్టుకొని అభిమానించడం గొప్ప విషయమన్నారు. తన మనువడికి కేసీఆర్ పేరు వచ్చే విధంగా పేరు పెట్టిన హమాలీ శ్రీనివాస్‌ను అభినందించడంతో పాటు ఆయన మనువడిని కేటీఆర్ ఆశీర్వదించారు.