ఉప్పల్, డిసెంబర్ 17: దేశ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళ నేతలు రాణిరెడ్డి, సంధ్యాల ఆధ్వర్యంలో ఎమ్మె ల్యే బేతి సుభాష్‌రెడ్డి సమక్షంలో పలువురు మహిళలు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే నివాసంలో మహిళలకు బీఆర్ఎస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని జాతీయపార్టీగా మార్చారని, దేశ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరు దృష్టి సారించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను చూసి, ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల ని, తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రజల కోసం పనిచేసేవారికి ఎప్పటికి గుర్తింపు ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు గడ్డం రవికుమార్, గంగిడి కృష్ణారెడ్డి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతాం
సమస్యల పరిష్కారానికి ప్రణాళికతో ముందుకుసాగుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ‘ఉప్పల్ భగాయత్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ ప్రతినిధుల వినతి మేరకు జలమండలి అధికారులతో శనివా రం ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించి ఉప్పల్ భగాయత్‌లోని సమస్యలపై చర్చించారు. డ్రైనేజీ, నీటి సమస్యలు, తాగునీటి కనెక్షన్లు ఇచ్చేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు.
నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఉప్పల్ భగాయత్‌లో తాగునీటి కనెక్షన్లు, సమస్యలపై హెచ్ఎండీఏ అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సంతోశ్‌కుమార్, రజనీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.