సిటీబ్యూరో/మేడ్చల్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. సోమవారం హైదరాబాద్ స్థానానికి ఆరు, సికింద్రాబాద్ స్థానానికి 9, మల్కాజిగిరి స్థానానికి 11 నామినేషన్లు దాఖలయ్యాయి.
హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ సోమవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టికి అందజేశారు. 24న మరో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
– అబిడ్స్, ఏప్రిల్ 22