MLA Muta Gopal | చిక్కడపల్లి, జూలై 3 : అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత కాలంలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ అరుంధతి నగర్ బస్తీలో కొనసాగుతున్న కచ్చామోరీ (స్ట్రాం ) వాటర్ పనులను గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద ముప్పు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. దీనిపై అధికారులు కూడా ఆదేశించడం జరిగిందని తెలిపారు. భారత రాష్ట్ర సమితి రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహ, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు ముడారపు రాకేష్ కుమార్, ముచకుర్తి ప్రభాకర్, పాశం రవి, జివై గిరి, ఎస్ టి ప్రేమ, దేవయ్య, పి రాజకుమార్, ఈ విటల్, బి.కిరణ్ కుమార్, సంతోష్, చందు, టింకు, రచ్చ నరేష్, పాండు, బస్తి అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, సుజాత, ఇంజనీరింగ్ సెక్షన్ డిఈ గీత, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.