MLA Mallareddy | కీసర, మార్చి 12 : ప్రభుత్వం నుంచి అందించే సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు గొప్ప వరం లాంటిదని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలిపారు. నాగారం మున్సిపాల్టీ పరిధిలోని గోధుమకుంట గ్రామానికి చెందిన వంగేటి బాల్రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రూ. 33,000 విలువ చేసే చెక్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకొన్న వారందరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయంను అందిస్తున్నామన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికి చాలామంది కుటుంబాలకు ఆర్థిక సాయంను అందించామన్నారు. దవాఖానలో చికిత్స పొంది ఇంటికొచ్చిన వారికి ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం ఎంతగానో వారి కుటుంబానికి భరోసాగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గోధుమకుంట మాజీ సర్పంచ్ ఆకిటి మహేందర్‌రెడ్డి, మాజీ పంచాయతీ సభ్యులు తాండూరి సంధ్య, లబ్ధిదారులు తదితరులు పాల్లొన్నారు.