Erragadda | ఎర్రగడ్డ, మే 17 : ఎర్రగడ్డ డివిజన్ ఓల్డ్ సుల్తాన్ నగర్‌లోని బాబూ జగ్జీవన్ రాం కమ్యూనిటీ హాల్ వద్ద అతి తక్కువ ఎత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. స్థానికులతో పాటు ఆ మార్గంలో వెళ్లే వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. దీంతో స్థానికులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను కలిసి సమస్య గురించి వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు లేఖ రాశారు. ఆ ట్రాన్స్ఫార్మర్ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. సదరు లేఖను శనివారం డివిజన్ నాయకులు సంబంధిత అధికారికి అందజేశారు. ట్రాన్స్ఫార్మర్ను అక్కడ్నుంచి తొలగిస్తామని అధికారి పేర్కొన్నారు. డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవ, కె.మల్లేష్, దాసి శ్రీకాంత్, ప్రభాకర్, ఎ.రాజు, తరుణ్, రాజుసింగ్, రవి, గంట కిషన్, చందు, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.