మారేడ్‌పల్లి, ఏప్రిల్ 21: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత అన్నారు. ఆదివారం మోండా డివిజన్ లోని శివాజీనగర్, చాపలబావి, సెంకడ్బజార్, డొక్కలమ్మ బస్తీ, కుమ్మరిగూడ తదితర ప్రాంతాల్లో స్థానిక మాజీ కార్పొరేటర్ రూప ఆధ్వర్యంలో మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కుమార్తె మౌనికరెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ…బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు హరి, రామరావు, గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్: బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి కంటోన్మెంట్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ కంటోన్మెంట్లో సాయన్న చేసిన సేవలు ఇంకా కండ్ల ముందే కనిపిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేలు సాయన్న, లాస్యనందితలను కోల్పోయి..పుట్టెడు దుఃఖంలో కూడా ప్రజా సేవ చేసేందుకు వచ్చిన నివేదితను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.