హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, రేవంత్‌రెడ్డి మెదడులో చెత్త ఉన్నదని, ఆ చెత్తను పక్కకు తొలగించి మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు అబ్దుల్ ముఖీ చాంద్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకే ముస్లింలు ఉన్నారు, ముస్లింలకు ఇజ్జత్ ఉన్నదని జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడాన్ని చాంద్ తీవ్రంగా తప్పుపట్టారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆరెస్సెస్ విద్యార్థి అనే విషయం ముస్లింలు అందరికీ తెలుసని, ఆయన ముస్లింలను బెదిరింపులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అబ్దుల్ ముఖీ ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి కలిసి ముస్లింలను బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు ముస్లింలు భయపడరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ముస్లింల కోసం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.
ముస్లింలకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇన్నాళ్లుగా ఆ మాటను నిలబెట్టుకోలేదని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం అజారుద్దీన్‌ను మంత్రిని చేశారని అబ్దుల్ ముఖీ చాంద్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకే ముస్లింలు ఉన్నారు.. ఇజ్జత్ ఉందని రేవంత్ రెడ్డి అన్నాడు
రేవంత్ రెడ్డి RSS విద్యార్థి అని ముస్లింలు అందరికి తెలుసు.. రేవంత్ ముస్లింలను బెదిరింపులకు గురిచేస్తున్నాడు
కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి ముస్లింలను బెదిరిస్తున్నారు – మైనారిటీ నేత అబ్దుల్… https://t.co/N5bGXYyjJN pic.twitter.com/qUd4UjxFGD
— Telugu Scribe (@TeluguScribe) November 5, 2025
సీఎం రేవంత్‌రెడ్డి ముస్లింలను అవమానించేలా మాట్లాడారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని మరో బీఆర్ఎస్ నేత డిమాండ్ చేశారు. సీఎం క్షమాపణలు చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం నేతలను జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు.
జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అరటిపండ్ల వ్యాపారం చేసుకునే ముస్లింల షాపులను, గోదాములను మూసేసిందని ఆయన ఆరోపించారు. సీఎం కాంగ్రెస్ ఉన్నందుకే ముస్లింలు ఉన్నారని అంటున్నారని, మీ ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న ముస్లింలు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రహమత్‌నగర్ కార్పొరేటర్ షఫీ హోటల్‌ను మూసేశారని, షఫీ ముస్లిం కాదా..? అని నిలదీశారు.
రేవంత్ రెడ్డి ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలి
లేదంటే కాంగ్రెస్ ముస్లిం నేతలను ఒక్కరిని కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగనివ్వం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం అరటి పండ్ల వ్యాపారం చేసుకునే ముస్లింల షాపులను, గోదాంలను మూసివేసింది
నిన్న రేవంత్… https://t.co/N5bGXYyRzl pic.twitter.com/UtIUFYxJkP
— Telugu Scribe (@TeluguScribe) November 5, 2025