HomeHyderabadBrs Manifesto Should Be Carried Door To Door
గడపగడపకు మ్యానిఫెస్టోను తీసుకెళ్లాలి
బీఆర్ఎస్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను గడగడపకు తీసుకెళ్లాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బుధవారం జవహర్‌నగర్, తూంకుంట మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం శామీర్‌పేట మండలంలోని ఆలియాబాద్‌లో, ఘట్కేసర్ మండల నాయకుల సమావేశం చౌదరిగూడలో జరిగింది.
ప్రతిపక్షాల తీరును ఎండగట్టాలని శ్రేణులకు పిలుపు
కార్యకర్తల సమావేశంలో మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, అక్టోబర్ 25: బీఆర్ఎస్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను గడగడపకు తీసుకెళ్లాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బుధవారం జవహర్‌నగర్, తూంకుంట మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం శామీర్‌పేట మండలంలోని ఆలియాబాద్‌లో, ఘట్కేసర్ మండల నాయకుల సమావేశం చౌదరిగూడలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ ఎన్నికల ప్రచారం బూత్ స్థాయిల్లో జరగాలన్నారు. బూత్ కమిటీలు క్రీయాశీలకంగా పని చేసేందుకు నాయకులు కృషి చేయాలన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన తీరును ఓటర్లకు వివరించాలన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలిసి ఓటు అభ్యర్థించాలని సూచించారు. రైతుబీమా, రైతుబంధు, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలు గడగడపకు చేరాయన్నారు. కొత్తగా ఎన్నికల మ్యానిఫెస్టోలో కేసీఆర్ బీమా పథకం, ఆసరా పింఛన్ల పెంపును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఇప్పటికే రైతుబీమా ఎన్నో రైతు కుటుంబాలను ఆదుకుందన్నారు. ఇదే తరహాలో పేదలను కేసీఆర్ బీమా పథకం ఆదుకుంటుందన్నారు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ తీరును ఎండగట్టాలన్నారు.
ఈ సమావేశాల్లో ఘట్కేసర్ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి పన్యాల కొండల్ రెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. జవహర్‌నగర్ సమావేశంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేషన్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, తూంకుంట సమావేశంలో చైర్మన్ కారంగుల రాజేశ్వర్‌రావు, వైస్ చైర్మన్ పన్యాల వాణివీరారెడ్డి, బీఆర్ఎస్ తూంకుంట మున్సిపాలిటీ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, యాదగిరి, కౌన్సిలర్లు నర్సింగరావు, సురేశ్, పాండు, రాజ్‌కుమార్ యాదవ్, హరిబాబు, ఆ కోఆప్షన్ సభ్యులు శఫీయుల్లాబేగ్, శ్రీధర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు రాణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.